Court rejected MLA's son's plea in Jubilee Hills case
mictv telugu

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే కుమారుడికి చుక్కెదురు

November 9, 2022

Court rejected MLA's son's plea in Jubilee Hills case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కుమారుడికి కోర్టు నుంచి చుక్కెదురైంది. ముందుగా ఈ కేసు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని, అత్యాచార ఘటనలో తాను లేనని, తన ప్రమేయం కూడా ఏమీ లేదని అతడు పిటిషన్‌‌‌లో పేర్కొన్నాడు. అయితే అదంతా అబద్ధమని, మిగిలిన నిందితులతో కలిసి ఉన్నాడని, ఘటనకు ముందు కారులో కొద్ది దూరం ప్రయాణించాడని పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు.

అంతేకాక, ఇందుకు సంబంధించిన ఆధారాలను గతంలోనే కోర్టుకు సమర్పించామని గుర్తు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుమారుడి పిటిషన్‌‌ను కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ విషయాన్ని ఓ ఉన్నత పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, రుమేనియా దేశానికి చెందిన మైనర్ బాలికపై ఐదుగురు నిందితులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఇందులో పాతబస్తీకి చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండడం గమనార్హం.