గోరక్షకులపై ఉక్కుపాదం మోపండి - MicTv.in - Telugu News
mictv telugu

గోరక్షకులపై ఉక్కుపాదం మోపండి

September 6, 2017

గోరక్షణ పేరుతో అమాయకులను కొట్టి చంపుతుండటంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరి దురాగతాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణ బృందాన్ని(టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేరసింది. సీనియర్ పోలీసులు అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తూ వారంలోపు వీటిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ‘చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించకండి. గోరక్షణ దాడులపై కఠిన చర్యలు తీసుకోండి’ అని ఆదేశించింది. ‘గోరక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై అరాచకాలు, హింసాత్మక దాడులు చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలి’ అని తెహసీన్‌ ఎస్‌ పూనావాలా అనే సామాజిక కార్యకర్త సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై స్పందన తెలపాలన కోర్టు ఆరు రాష్ట్రాలను ఆదేశించింది.