ఓట్ల కోసం చూస్తూ ఊరుకున్నారు... - MicTv.in - Telugu News
mictv telugu

ఓట్ల కోసం చూస్తూ ఊరుకున్నారు…

August 26, 2017

హరియాణాలో జరిగిన ఆస్తుల విధ్వంసం, ఆస్తినష్టంపై పంజాబ్-హరియాణా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రాబోయే ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం ఖట్టర్ నేతృత్వంలోని హరియాణా ప్రభుత్వం ఆందోళనకారులను అడ్డుకోకుండా ఉపేక్షించిందని మండిపడింది. ఇది ఓట్ల కోసం రాజకీయంగా లొంగిపోవడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

డేరా బాబా గుర్మీత్ ను పంచకులలోని సీబీఐ కోర్టు రేప్ కేసులో దోషిగా తేల్చడంతో జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు 31 మంది చనిపోయారు. విధ్వంసం జరిగిన నష్టాన్ని బాబా ఆస్తులను జప్తు చేసి పూడ్చుకోవాలని హైకోర్టు శుక్రవారమే ఆదేశించింది. విధ్వంసంపై దాఖలైన పిల్ ను కోర్టు శనివారం విచారించింది.

‘సంఘ విద్రోహ శక్తులు అల్లర్లకు పాల్పడ్డాయని సీఎం చెబుతున్నారు.  విధ్వంసం జరిగే అవకాశముందని నిఘా వర్గాలు ముందుగానే చెప్పాయి. మరైతే ప్రభుత్వం ఏడు రోజులుగా ఏం చేస్తోంది?‘ అని కడిగిపారేసింది. విధ్వంసంలో వాటిల్లిన నష్టంపై స్పందిస్తూ.. డేరా బాబా ఆస్తుల వివరాలు తమకు చెప్పాలని, తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు వాటిని అమ్మడం కానీ బదిలీ చేయడం కానీ చేయొద్దని అధికారులను ఆదేశించింది.