వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్.. భారతీయుడు కాదంటూ ఆయన భారత పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దాన్ని సవాల్ చేస్తే చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ వేశారు. పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేముందు, తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదని చెన్నమనేని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
పౌరసత్వం రద్దుపై మళ్లీ విచారించాలని ఆయన హైకోర్టును కోరారు.అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం,పై స్టే విధిస్తూ ఎమ్మెల్యే అభర్థనపై ఆరు వారాల్లోగా ఏ విషయం తేల్చాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఆఖర్కి హైకోర్టు ఎమ్మెల్యే చెన్నమనేని జర్మనీ పౌరుడని నిర్ధారిస్తుందా ? లేక భారతీయుడేనని తేల్చేస్తుందా అనేది సూడాలె మరి.