Covering with amber scarf .. Hardik Patel
mictv telugu

కాషాయం కండువా కప్పుకున్న.. హార్దిక్ పటేల్

June 2, 2022

Covering with amber scarf .. Hardik Patel

గుజరాత్‌ రాష్ట్రం గాంధీ నగర్‌లోని బీజేపీ కార్యాలయంలో హార్దిక్ పటేల్ కాషాయం కండువాను కప్పుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన.. గురువారం ఉదయం ట్విటర్ వేదికగా..’నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కోసం సైనికుడిలా పనిచేస్తా. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం నేటి నుంచి రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న’ అని ప్రకటించారు. ఆ ప్రకారమే నేడు మధ్య్నాహం బీజేపీలో చేరారు.

హార్దిక్ పటేల్.. 28 ఏళ్ల వయసులోనే గాంధీనగర్ పాటిదార్ అనామత్ ఆందోళన ఉద్యమంతో ప్రజాదరణ పొందారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ రాష్ట్ర యూనిట్‌లో కీలక స్థానంలో కొనసాగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ‘గుజరాత్‌లో పార్టీ నాయకత్వం నన్ను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ నాయకత్వానికి గుజరాత్‌పై ఏమాత్రం ఆసక్తి గాని, పట్టుగాని లేదు. ప్రజల వద్దకు చేరుకునేందుకు ఆ పార్టీ వద్ద సరైన రోడ్ మ్యాప్ లేదు. అందుకనే ఆ పార్టీ ప్రతి చోటా తిరస్కరణకు గురవుతోంది’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీజేపీ పార్టీ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, ఆయన ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయించుకున్న విధంగానే నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.