అజిత్ పెద్దమనసు.. రూ.1.25 కోట్లు సాయం - MicTv.in - Telugu News
mictv telugu

అజిత్ పెద్దమనసు.. రూ.1.25 కోట్లు సాయం

April 7, 2020

COVID-19: Ajith donates Rs 1.25 crores to Coronavirus relief fund

కరోనా మిగిలిస్తున్న కల్లోలాన్ని గట్టెంక్కించేందుకు సెలబ్రిటీలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమవంతుగా సాయం చేసి సంక్షోభంలో మేము మీ వెంట ఉన్నాం అని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్ కుమార్ క‌రోనాపై పోరుకి భారీ విరాళాన్ని ప్ర‌క‌టించారు. కోటి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌టించారు. ఇందులోంచి రూ.50 లక్షలను ప్రధానమంత్రి సహాయ నిధికి, రూ.50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. మిగిలిన రూ.25 లక్షలను దక్షిణాది సినీ కళాకారులకు (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) విరాళంగా అందజేస్తున్నట్టు అజిత్ వెల్లడించారు. 

ఈ సందర్భంగా ‘FEFSI’ స్పందిస్తూ.. ‘విపత్కర పరిస్థితుల్లో సినీ కార్మికులను, కళాకారులను ఆదుకోవడానికి ముందుకువచ్చిన అజిత్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని తెలిపారు. కాగా, టాలీవుడ్‌లోనూ సినీ కార్మికులను ఆదుకోవడానికి సినీ పెద్దలు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కార్డులేని సినీ కార్మికులను ఆదుకునేందుకు జార్జిరెడ్డి సినిమా టీం 100 మంది కార్మికులకు పది రోజులకు సరిపడా బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, ఉల్లిపాయలు అందించి ఆదుకున్నారు.