కరోనా రక్కసి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 2,12000 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఆయా దేశాల గణాంకాల ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ లెక్కలు వెల్లడించింది. వీటిలో 60 శాతం అమెరికా, బ్రెజిల్ దేశాల్లోనే నమోదయ్యాయని చెప్పారు. అమెరికాలో 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా..బ్రెజిల్లో 24,431 కరోనా కేసులు వచ్చాయి. తొలిసారి ఈ స్థాయిలో వైరస్ లక్షణాలు బయటపడటంతో మరింత ఆందోళన మొదలైంది.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,56,641 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ కాటుకు 5,36,776 మంది చనిపోయారు. అమెరికాలో 29,82,928 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో రష్యా మూడో స్థానంలో ఉండగా.. దాన్ని భారత్ దాటేసింది. భారత్లో ఆదివారం సాయంత్రానికి 6.9 లక్షల కేసులు ఉండటంతో రష్యా నాలోగో స్థానానికి పడిపోయింది.