Home > Featured > కరోనా వైరస్ చిరంజీవి, ఎప్పటికీ మనతోనే.. డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్ చిరంజీవి, ఎప్పటికీ మనతోనే.. డబ్ల్యూహెచ్ఓ

COVID-19.

వచ్చిన గాచారం ఊరికినే పోదు అని అంటారు. అలాగే తయారైంది ఇప్పుడు కరోనా పరిస్థితి చూస్తుంటే. ‘నేను మీకు ఇప్పటికిప్పుడు లొంగని మొండి ఘటాన్ని. నన్ను అంతం చేయడం ఇప్పట్లో మీ వల్ల అయ్యే పని కాదు.. అంత ఈజీ కూడా కాదు. మీ అంతు చూస్తాను’ అన్నంత పనే చేస్తోంది ఆ మహమ్మారి. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలకు పాకి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది కరోనా. లక్షల మంది ప్రాణాలను కబళించిన ఈ వైరస్ ప్రజల ఆరోగ్యాన్నే కాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం ఖతం చేసింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ ఎప్పటికీ ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించకపోవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ మైకేల్ ర్యాన్ వెల్లడించారు. దీనిని ఎదుర్కొనేందుకు మన వద్ద ఆయుధం(వ్యాక్సిన్) లేదని.. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో అందుకు అనుగుణంగా వ్యాధి నిరోధక శక్తి స్థాయి పెరిగేందుకు సుదీర్ఘ సమయం పట్టొచ్చని అన్నారు. గతంలో వచ్చిన హెచ్ఐవీ లాంటిదే ఈ కరోనా అని అభిప్రాయపడ్డారు.

ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ రాలేదు కానీ మెరుగైన చికిత్సా విధానం మాత్రం అందుబాటులోకి వచ్చిందని.. కరోనా వైరస్ కూడా అంతేనని భావిస్తున్నాం అని చెప్పారు. ఇది మానవాళిని అంటి పెట్టుకునే ఉంటుందనిపిస్తోందని తెలిపారు. మరోవైపు ఆ సంస్థకు చెందిన ఓ నిపుణుడు రూపొందించిన నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చు. హెచ్ఐవీ మాదిరిగానే కరోనా కూడా ఎప్పటికీ పోదు. ఈ వైరస్ ఎప్పటికీ దూరం కాకపోవచ్చని ఆ సంస్థ ర్యాన్ అన్నారు.

Updated : 14 May 2020 5:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top