కరోనా కొత్త హింస.. జట్టు ఊడిపోతోంది...  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కొత్త హింస.. జట్టు ఊడిపోతోంది… 

August 10, 2020

COVID-19 could cause your hair to fall out.

తమకు ఆ మహమ్మారి కరోనా వైరస్ సోకవద్దని చాలామంది కోరుకుంటున్నారు. ఒకవేళ కరోనా సోకినా ప్రాణాపాయం నుంచి గట్టెక్కి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే కరోనా సోకి కోలుకుని గండం గట్టెక్కింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే కరోనా తగ్గిపోయాక దాని ప్రభావంతో కొందరు ఇంకొక కరోనా కొత్త హింసను అనుభవిస్తున్నారు. చాలామందిలో  జుట్టు ఊడిపోతోందట. కరోనా నుంచి కోలుకున్న నలుగురిలో ఒకరి జుట్టు బాగా ఊడిపోతోందని ఓ సర్వే తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో 1,500 మందిపై ఆన్‌లైన్ సర్వే జరిపి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించింది సదరు సర్వే సంస్థ. మార్చి నెలలో కరోనాతో పోరాడిన బాధితురాలికి తలపై జుట్టు మొత్తం ఊడిపోయి బట్టతల అయిందని వెల్లడించింది. వారి అనుభవాలను కూడా సర్వే వెల్లడించింది.
సగం కంటే ఎక్కువ జుట్టు రాలిపోవడంతో ఆమె విగ్ ధరించవలసి వస్తుందని ఆందోళన చెందుతోందట. 

ఫేస్‌బుక్ గ్రూప్ నుంచి వచ్చిన ఫలితాలలో 27 శాతం మందికి జుట్టు రాలిపోయిందని చెప్పారు. నెత్తిమీద జుట్టు రాలడమే కాకుండా కనుబొమ్మలతో పాటు శరీరంలోని ఇతర భాగాలపై ఈ సమస్య ఉండొచ్చని వివరించారు. దీనిని telogen effluvium (TE)గా గుర్తించారు. కరోనా రోగులు తాత్కాలికంగా ఒత్తిడిని ఎదుర్కొంటే ఇలాంటి సమస్య తలెత్తుందని వైద్యులు తెలిపారు. నడినెత్తిపై ఉండే ఫోలికెస్ సంఖ్య మారినప్పుడు TE సమస్య వస్తుందని.. సాధారణంగా నెత్తిమీద పైభాగాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. TE తీవ్రమైన కేసుల్లో ఎక్కువగా కనుబొమ్మలు, శరీరంలోని ఇతర భాగాల్లో జుట్టు రాలిపోవడం కనిపిస్తుందని ప్రకటించారు. TEని పెద్ద మొత్తంలో బరువు తగ్గడం లేదా తీవ్రమైన జ్వరం తర్వాతే నిర్ధారణ చేస్తారని చెప్పారు. ఈ విషయమై చర్మవ్యాధి నిపుణులు శిల్పి ఖేతర్‌పాల్ మాట్లాడుతూ.. ‘కరోనా బాధితుల్లో ఎక్కువగా జుట్టు రాలే సమస్య కనిపిస్తోంది. రెండు మూడు నెలల క్రితం కోవిడ్ -19 నుంచి కోలుకున్న రోగుల్లో జుట్టు రాలడాన్ని గుర్తించాం. ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అధిక జ్వరం, అధిక బరువు తగ్గడం లేదా ఆహారంలో మార్పు వంటి అనేక సాధారణ కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మెనోపాజ్ వంటి హార్మోన్ల మార్పులు కూడా కారణం కావచ్చు. ఇతర వైద్య లేదా పోషక పరిస్థితుల్లోనూ ఇలాంటి సమస్య ఎదురవుతుంది. TEని ఎదుర్కునేవారు నెత్తి పూర్తిగా మామూలుగా కనిపించాలి. దద్దుర్లు, దురదలు లేదా పొరలు ఉండకూడదు. రోగులకు గనక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని కలవాలి’ అని తెలిపారు. కాగా, కరోనా బారిన పడినవారిలో సైకోసిస్, అలసట, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయని నిపుణులు వెల్లడించారు.