COVID-19 : Five foreigners test positive for COVID-19 in Bodh Gaya
mictv telugu

బీహార్‌లో ఐదుగురు విదేశీయులకు కరోనా

December 26, 2022

Five foreigners test positive for COVID-19 in Bodh Gaya

ప్రపంచాన్ని మరోసారి కరోనా మహమ్మారి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న వైరస్‌ మళ్లీ విరుచుకుపడుతోంది. చైనా, జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 రకం కరోనా వైరస్‌.. భారత్‌లోనూ వెలుగుచూసింది. గత వారం గుజరాత్‌లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 రకం కరోనా వేరియంట్ బయటపడింది. తాజాగా బీహార్‌లో ఐదుగురు విదేశీయులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం కలవరానికి గురి చేస్తోంది. గయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా తేలింది. దాంతో ఉలిక్కిపడిన వైద్య శాఖ వెంటనే అప్రమత్తమైంది.

బౌద్ధ గురువు దలైలామా నెల రోజుల పాటు బోధ్‌గయలో ఉండనుండటంతో.. ఆయన్ను కలిసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి రానున్నారు. ఈ క్రమంలో వైద్య వర్గాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. గయ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో ఆదివారం జలుబు, దగ్గుతో బాధపడుతోన్న 33 మందిని పరీక్షించగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. వారిలో నలుగురు థాయ్‌లాండ్‌కు చెందిన వారు కాగా.. ఒకరు మయన్మార్‌కు చెందిన వ్యక్తి. అందులో నలుగురిని గయలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరో వ్యక్తి ఢిల్లీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దాంతో వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి :

ఈ విద్యార్థి కోసం నెలకు రూ.3లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం

300 కి.మీ.లు వీల్ చెయిర్ లో శబరిమలకు..