కోరలు చాచిన కరోనా.. దేశంలో  2,26,770 మందికి పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

కోరలు చాచిన కరోనా.. దేశంలో  2,26,770 మందికి పాజిటివ్

June 5, 2020

COVID-19 Global UpDate

దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువ కావడంతో కొత్తగా వ్యాధిబారిన పడిన గణాంకాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 9,851 మందికి కొత్తగా కరోనా సోకింది. 273 మంది మరణించారు.  దీంతో ఇప్పటి వరకు మొత్తం దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 2,26,770కు చేరింది. 6348 మంది వైరస్ కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు 1,09,462 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేయగా.. ఇంకా 1,10,960 మందికి  చికిత్స కొనసాగిస్తున్నారు. దీంతో రికవరీ రేటు 49 శాతంగా ఉంది. 

ప్రధానంగా మన దేశంలో నాలుగు రాష్ట్రల్లో తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కోరలు చాచడంతో లక్షకు చేరుకునే దిశగా వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 

74,860, తమిళనాడులో 25,872, ఢిల్లీలో 23,645, గుజరాత్ 18,100 మందికి వ్యాధి సోకింది. 

ప్రపంచవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దాదాపు 130,000గా పేర్కొన్నారు. దీంతో 6.4 మిలియన్ల రోగులు సంఖ్య పెరిగింది. మరణాల సంఖ్య 380,000 కు చేరుకుందని తెలిపారు.