చెలరేగుతున్న కరోనా.. హైదరాబాద్ కిరాణ మర్చంట్స్ కీలక నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

చెలరేగుతున్న కరోనా.. హైదరాబాద్ కిరాణ మర్చంట్స్ కీలక నిర్ణయం

June 25, 2020

mhvhm

నిత్యం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార వర్గాలు కూడా హైరానా చెందుతున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ కిరాణ మర్చంట్‌ అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు బేగంబజార్‌లోని కిరాణా షాపులు తెరవకూడదని నిర్ణయించారు. ఈ నెల 28 నుంచి జులై 5 వరకు బేగంబజార్‌లో దుకాణాలు మూసివేయనున్నట్లు కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ వెల్లడించారు. 

కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేశారు. ఈ విషయాన్ని చిరు వ్యాపారులు, ప్రజలు గమనించగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, నేడు తెలంగానలో 920 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 737 కేసులు నమోదయ్యాయి. కరోనా చికిత్స పొందుతూ నేడు ఐదుగురు మృతిచెందారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 11 వేలు దాటింది.