షాపుల బంద్.. జనం ఆగ్రహం.. వెనక్కి తగ్గిన సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

షాపుల బంద్.. జనం ఆగ్రహం.. వెనక్కి తగ్గిన సీఎం

March 27, 2020

కరోనా వ్యాప్తి నియంత్రణకు గోవా ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటోంది. నిత్యావసరాల షాపులు కూడా తెరవకూడదని ఆదేశాలు జారీచేసింది. దీంతో గోవా ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇంత కఠినమైన నిబంధనలు పాటించవద్దు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో నిత్యావసరాలకు సంబంధించిన షాపులన్నీ తెరుస్తుంటే, గోవాలో మాత్రం నిషేధం ఎందుకు అంటూ మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం మెట్టు దిగి రాక తప్పలేదు. పాలు, ఇతర నిత్యావసరాలకు సంబంధించిన షాపులు తెరవడానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ అనుమతులు ఇచ్చారు. షాపులు తెరవడంపై ఆయన స్పందిస్తూ.. ‘ఈ నిత్యావసరాల షాపులు తెరిస్తే, 90శాతం గోవాను ఓపెన్ చేసినట్లే. ఇక లాక్ డౌన్ ఎక్కడ ఉంటుంది? భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆందోళనగా ఉంది’ అని ప్రమోద్ సావంత్ అన్నారు.

కాగా, చాపకింద నీరులా దేశంలో వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఈ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే నిత్యావసరాలకు సంబంధించిన షాపులు(కిరాణ, కూరగాయలు, పాలు) మాత్రం తెరిచి ఉంటాయని తెలిపింది. ఈ విషయంలో గోవా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి.. వెనక్కు తగ్గింది.