తందూరి చికెన్‌కు కరోనా రోగుల ఆర్డర్..తెలియక వెళ్లి డెలివరీ బాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

తందూరి చికెన్‌కు కరోనా రోగుల ఆర్డర్..తెలియక వెళ్లి డెలివరీ బాయ్

May 20, 2020

Covid 19

కరోనా బాధితులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే. అక్కడ వాళ్లకు శాకాహారం మాత్రమే ఇస్తున్నారు. దీంతో కొందరు కరోనా బాధితులు మాంసం కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో తందూరీ చికెన్, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే, ఆర్డర్ చేసినవాళ్లు కరోనా ఐసోలేషన్ సెంటర్ లో ఉన్నారని తెలియక ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు. 

ఫోన్ లో చూపిస్తున్న లొకేషన్ ప్రకారం ఐసోలేషన్ గదిలోకి వెళ్లబోయాడు. అదే సమయంలో డెలివరీ బాయ్ ని సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. అది కరోనా వార్డు అని చెప్పాడు. దీంతో డెలివరీ బాయ్‌ షాక్ కి గురయ్యాడు. సెక్యూరిటీ గార్డు వెంటనే ఆస్పత్రి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు రంగంలోకి దిగారు. ఆర్డర్ చేసిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జరిగింది.