తెలంగాణ@1269 కేసులు.. 8 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ@1269 కేసులు.. 8 మంది మృతి

July 12, 2020

269

తెలంగాణలో నేడు కూడా కరోనా తన రికార్డును నెలకొల్పింది. రాష్ట్రవ్యాప్తంగా 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 800 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారిగా తీసుకుంటే.. రంగారెడ్డి 132, మేడ్చెల్ 94, సంగారెడ్డి 36, కరీంనగర్ 23, నాగర్ కర్నూల్ 23, మహబూబ్ నగర్ 17, నల్గొండ 15, వనపర్తి 15, మెదక్ 14, వరంగల్ అర్బన్ 12, నిజామాబాద్ 11, పెద్దపల్లి 9, మహబూబా బాద్ 8, యాదాద్రి 7, సూర్యాపేట్ 7, గద్వాల్ 7, వికారాబాద్ 6, జనగాం 6, నిర్మల్ 4, జగిత్యాల 4, అదిలాబాద్ 4, మంచిర్యాల 3, సిద్దిపేట్ 3, భద్రాద్రి కొత్తగూడెం 3, రాజన్న సిరిసిల్లా 3, వరంగల్ రూరల్ 2, ఖమ్మం 1గా మొత్తం 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 34,671కి పెరిగాయి. ఇవాళ కరోనా చికిత్స పొందుతూ కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో 1,563 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 22,482కి చేరింది. ఈరోజు కరోనా చికిత్స పొందుతూ 8 మంది మృతిచెందగా.. ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 356కు పెరిగింది. కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో 11,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి.