కరోనా కల్లోలం.. దేశంలో ఒక్కరోజే 32,695 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కల్లోలం.. దేశంలో ఒక్కరోజే 32,695 కేసులు

July 16, 2020

Covid 19 Update in India July 16

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకూ రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 32,695 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు.3,26,826 శాంపిళ్లను పరీక్షించగా.. ఈ స్థాయిలో కేసులు వచ్చాయి. 606 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.   

తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 9,68,876 మంది వైరస్ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 24,915కు చేరింది. ఇప్పటి వరకు 6,12,815 మంది చికిత్స తీసుకొని కోలుకున్నారు.3,31,146 మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటి వరకు మొత్తం 1,27,39,490 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. 

Covid 19 Update in India July 16
Covid 19 Update in India July 16