అంబులెన్సులో బిడ్డ మృతదేహం.. వెనుక బైక్‌పై కన్నీటితో తండ్రి
మనీశ్ కుమార్ ఆస్పత్రిలో వార్డ్ బాయ్. కరోనా విధుల్లో ఉన్నాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడు డ్యూటీలో ఉండగా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వారు చెబుతున్న మాటలు విని గుండె పగిలింది. అతని మూడేళ్ల కొడుకు కడుపునొప్పితో బాధపడ్డాడని, ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయడని చెప్పాడు. తన వేదనను అతడు సహోద్యోగులకు చెప్పలేదు. దుఖాన్ని అదిమిపట్టుకుని పని చేశాడు.
డ్యూటీ అయిపోగానే తన కొడుకు చినోయిన ఆస్పత్రికి వేగంగా చేరుకున్నాడు. అయితే కరోనా నేపథ్యంలో బిడ్డను కడసారిగా గుండెలకు హత్తుకుని ఏడ్చడానికి కూడా వీల్లేకుండా పోయింది. దూరంగా నిలబడి బిడ్డను చూస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. వైద్యసిబ్బంది తన కొడుకును బట్టల్లో చుట్టి అంబులెన్సుల తీసుకెళ్తుంటే బైక్ పై దూరం నుంచే చూస్తూ అనుసరించాడు. అంత్యక్రియలు కూడా దూరం నుంచే చూశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటుచేసుకుందీ విషాదం. మనీశ్ లోకబంధు ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కరోనా ఐసొలేషన్ వార్డులో డ్యూటీ కనుక కుటుంబసభ్యులకూడా దూరంగా మెసలుతున్నాడు. బిడ్డను కడసారి ముద్దాడాలనున్నానని, దానికీ నోచుకోకపోవడంతో ఇప్పుడు వాడి ఫొటోలు, వీడియోలు చూస్తున్నానని మనీశ్ చెప్పాడు.