ప్రముఖ టీవీ ఛానల్‌లో 28 మందికి కరోనా.. 2,500 మందికి టెస్టులు
కరోనా పోరాట యోధుల యుద్ధం ఒకెత్తు అయితే.. ఎప్పటికప్పుడు కరోనా సమాచారాన్ని ప్రజలకు చేరమవేస్తూ అప్రమత్తం చేస్తున్న మీడియా జర్నలిస్టుల పనితనం కూడా మరో ఎత్తు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు మీడియా జర్నలిస్టులు కరోనా బారినపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ ZEE NEWSలో ఉద్యోగం చేస్తున్న 28 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ సంస్థ ఉద్యోగులతో పాటు సాటి మీడియా సిబ్బంది షాక్‌కు గురయ్యారు. సదరు టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ సుధీర్ చౌధరి తమ టీవీ ఛానల్ ఉద్యోగుల్లో 28 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందని ద్రువీకరించారు.
దీంతో తమ సంస్థలో పనిచేస్తున్న 2,500 మంది ఉద్యోగులకు అందరికీ కరోనా పరీక్షలు చేయించామని వెల్లడించారు. ఆ దేవుడి దయవల్ల కరోనా సోకలేదని.. సోకినవారు కరోనాతో పోరాటం చేస్తూ కోలుకుంటున్నారని తెలిపారు. వారంతా త్వరగా కోలుకుని ఇంటికి క్షేమంగా వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. కరోనా వైరస్‌కు భయపడి తమ విధులను నిర్లక్ష్యం చెయ్యమని, ప్రజలకు నిత్యం తమ ఛానల్ అందుబాటులోనే ఉంటుందని సదరు ఛానల్ ఉద్యోగులు ధీమాగా చెబుతున్నారు.