7,19,665 కేసులు, 20,160 మరణాలు.. దేశంలో కరోనా విలయం - MicTv.in - Telugu News
mictv telugu

7,19,665 కేసులు, 20,160 మరణాలు.. దేశంలో కరోనా విలయం

July 7, 2020

vncvn c

అన్‌లాక్ 2 అమలు అవుతున్నా దేశంలో అంతకంతకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఏ మాత్రం కట్టడి కావడం లేదు. ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది. రోజు రోజుకూ కేసుల తీవ్రలో సరికొత్త రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 22,252 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలను గుర్తించారు. 467 మంది వైరస్ కాటుకు బలి అయ్యారు. 

ఇప్పటివరకు దేశంలో మొత్తం 7,19,665 మంది కరోనా రోగులు ఉన్నారు. 20,160 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారి నుంచి 4,39,948 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఇంకా  2,59,557 మందికి ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 5,368 కొత్తగా వ్యాధిబారిన పడ్డారు. 204 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,11,987కు చేరగా..9,026 మంది చనిపోయారు. 87,681 రోగులు కోలుకున్నారు. తమిళనాడులో 1,14,978 మందికి వ్యాధి సోకగా 46,833 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,571 మంది చనిపోయారు. గుజరాత్‌లో 36,858 కేసులు ఉన్నాయి. 26,323 కోలుకున్నారు.