covid cases increase in india
mictv telugu

బీ అలర్ట్..భారత్‎లో పెరుగుతున్న కరోనా కేసులు

December 24, 2022

కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. చైనాలో విజృంభిస్తున్న కరోనా క్రమంగా ప్రపంచ దేశాలకు మళ్లీ పాకుతుంది. భారత్‌లో కొత్త వేరియంట్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నాలుగు BF-7 కేసులు భారత్‎లో ఉన్నాయి. మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 201 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,397 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతుంది.ఇప్పటి వరకు 220.04 కోట్ల కరోనా వ్యాక్సిన్లు వేశారు. గత 24 గంటల్లోనే ఏకంగా 1,05,044 డోసులు వేశారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభత్వం అప్రమత్తమైంది. గత అనుభవాలను దృష్ట్యా ముందు జాగ్రత్తలు చేపట్టింది.ఇప్పటికే అధికారులతో ప్రధాని మోడీ సమావేశమై..పరిస్థితిని సమీక్షించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే స్కీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనాలో కరోనా విజృంభిస్తోంది. చైనాలో గతవారంలో రోజుకు సగటున 3.7 కోట్ల కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.భారీగా మరణాలు సంభవిస్తున్నా చైనా అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు తగినంతగా లేకపోవడంతో అల్లాడుతోంది.