అమ్మకానికి కరోనా సర్టిఫికెట్లు.. ధర ఎంతో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకానికి కరోనా సర్టిఫికెట్లు.. ధర ఎంతో తెలుసా?

October 28, 2020

Covid Certificates Selling in Karnataka .jp

ఇప్పటి వరకు ఫేక్ స్టడీ సర్టిఫికెట్లు, ఇతర డాక్యూమెంట్లను మాత్రమే చూసి ఉంటాం. తాజాగా నకిలీ కరోనా సర్టిఫికెట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అక్రమ సంపాధన కోసం కొన్ని ఆస్పత్రులు అడ్డదారులు తొక్కుతున్నాయి. డబ్బులు తీసుకొని కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. కర్ణాటక ఈ కొత్త దందా వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రత్యేకించి ఓ ధరను ఫిక్స్ చేసి మరీ అమ్ముతున్నారు. ఈ ముఠాను ఇటీవల పోలీసులు గుర్తించారు. 

బెంగళూరు నగరంలో ఓ ఆస్పత్రిలో ఈ తతంగం నడుస్తోంది. విషయం తెలియడంతో పోలీసులు ఎంట్రీ ఇవ్వగానే డాక్టర్ సహా నిర్వాహకులు పారిపోయారు. వారు ముగ్గురు కూడా మహిళలే ఉన్నారు. బీబీఎంపీ డాక్టర్ శైలజతో పాటు ల్యాబ్ టెక్నీషన్, ఆశా వర్కర్ మహాలక్ష్మీగా గుర్తించారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డాక్టర్ సరిఫ్టికెట్ కూడా రద్దు చేశారు. సులువుగా డబ్బులు సంపాధించాలనే ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.  

కాగా, ఇతర ప్రాంతాలకు, విహార యాత్రలకు వెళ్లాలంటే కరోనా టెస్టులు తప్పనిసరి. నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారినే అనుమతి ఇస్తున్నారు. దీంతో ఈ కొత్త రకం దందాకు తెరలేచింది. ఈ నిబంధననే కొన్ని ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా టెస్టులు చేసి సర్టిఫికెట్లను చేతిలో పెడుతున్నారు. దీని కోసం ఒక్కో వ్యక్తి వద్ద నుంచి రూ. 2500 వసూలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా అధికారులు తేల్చారు. ఇలా చేయడం వల్ల వైరస్ అంటిస్తే పరిస్ధితులు  ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.