కొత్త కరోనా లక్షణాలు ఇవే.. జాగ్రత్త! - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త కరోనా లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

December 24, 2020

GB

దాదాపు ఏడాది కాలంగా ప్రపంచానికి నరకం చూపుతున్న కరోనా రూటు మార్చింది. కొత్త లక్షణాలతో విజృంభిస్తోంది. బ్రిటన్‌లో కనిపించిన కొత్త స్ట్రెయిన్ తాజాగా మనదేశంలో కూడా అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో కొత్త కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. 

ఇదివరకు మనం చూసిన కరోనా వేరు. ఇప్పుడు భయపెడుతున్న కరోనా వేరు. పాత కరోనాకంటే 70 శాతం వేగంగా వ్యాపిస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి కొత్త కరోనా లక్షణాలు ఏమిటో తెలుసుకుందామా.. మనకు తెలిసిన కరోనాలో కనిపించే జ్వరం, దగ్గు, రుచి, వాసన లేకపోవడం వంటివి కొత్త కరోనాలోనూ ఉంటాయి. కొత్త స్ట్రెయిన్‌లో వీటితోపాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు తతెత్తుతాయి. 

తీవ్రమైన అలసట ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. తలనొప్పి ఉంటుంది. ఏ పనీ చేయబుద్ది కాదు. తరచూ విరేచనాలు కూడా అవుతుంటాయి. మానసికంగా గందరగోళానికి గురువుతుంటారు. చిన్నపాటి మతిమరపు కూడా ఉంటుంది. కండరాల నొప్పి కూడా ఉంటుంది. గొంతు మంట, పొడి దగ్గు, చర్మంపై దద్దుర్లు, చేతి వేళ్లు కాలి వేళ్లు పాలిపోవడం కనిపిస్తుంది. శ్వాస కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. ఇన్ని లక్షణాలు ఉండడం వల్లే ఇది పాత కరోనా కంటే 70 శాతం వేగంగా విస్తరిస్తోంది. ఈ లక్షణాలు కనిపిస్తే కంగారు పడకుండా వైద్యుణ్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.