covid prevalence is increasing again in Telangana, 494 cases in past 24 hours
mictv telugu

తెలంగాణలో కరోనా ఉధృతి.. 500 కి చేరువలో కొత్త కేసులు

June 23, 2022

covid prevalence is increasing again in Telangana, 494 cases in past 24 hours

తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం 400కి చేరువలో కోవిడ్ కేసులు నమోదు కాగా.. తాజాగా 500కి చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం రాష్ట్రంలో 28,865 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 494 మందికి పాజిటివ్ సోకినట్లు తేలింది.

దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. ప్రస్తుతం తెలంగాణలో 3048 మంది కరోనా కారణంగా ఐసోలేషన్లో ఉన్నారు లేదంటే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాజిటివిటీ రేటు ఎక్కువున్న జిల్లాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. కొవిడ్‌ వైరస్‌ మ్యుటేషన్లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. హోల్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయాలని, ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు.