కరోనా అప్‌డేట్ : 24,248 కేసులు..425 మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

 కరోనా అప్‌డేట్ : 24,248 కేసులు..425 మరణాలు

July 6, 2020

vb b

దేశంలో కరోనా కరాళనృత్యం ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓ వైపు కోలుకున్న వారు పెరుగుతున్నా.. మరోవైపు కొత్తగా వ్యాధిబారిన పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆదివారం భారత్‌లో 24,248 మందికి కొత్తగా వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. 425 మంది ప్రాణాలు కోల్పోయారు. 

తాజా లెక్కలతో ఇప్పటి వరకు దేశంలో 6,97,413 మంది వ్యాధికి గురయ్యారు. మృతుల సంఖ్య 19,693కు పెరిగింది. నిన్న ఒక్కరోజే  1,80,596 శాంపిళ్లను  పరీక్షించినట్టుగా చెప్పారు. 4,24,433 మంది వైరస్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 2,53,287 మందికి ఆయా రాష్ట్రాల కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటికే భారత్ వైరస్ వ్యాప్తిలో మూడో స్థానానికి చేరింది. ఇప్పటి వరకు రష్యా ఆ స్థానంలో ఇప్పుడది నాలుగో స్థానానికి పరిమితమైంది.