కరోనా రెండు వేరియంట్ల తర్వాత ఇటీవల చాలా దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై కోవిషీల్డ్ వ్యాక్సిన్ పనిచేయదని పుణెలోని భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఓ ఆరోగ్య కార్యకర్త టీకా తీసుకోకముందు ఒకసారి, కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత రెండు సార్లు కరోనా సోకినట్టు అధ్యయనంలో వెల్లడైందని తెలిపింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో టీకా నుంచి ఒమిక్రాన్ వైరస్ తప్పించుకున్నట్టు నిరూపితమైందని వారు వెల్లడించారు. ఇలాంటి వారు కరోనా బూస్టర్ డోస్ తీసుకోవడం అత్యవసరమని ప్రకటించింది. బూస్టర్ డోస్ ఒమిక్రాన్‌పై మెరుగైన పనితీరు కనబరస్తున్నటువంటి వివరాలతో కూడిన ఈ అధ్యయన నివేదిక ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో పబ్లిష్ అయింది.