ఆవును గెల్చుకోండి, తినేయండి. ఓ హోటల్ పోటీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆవును గెల్చుకోండి, తినేయండి. ఓ హోటల్ పోటీ

March 28, 2018

కస్టమర్లను ఆకర్షించడానికి ఏం చేసినా సరైందేననే ధోరణి ప్రబలిపోతోంది. లండన్‌లోని స్మిత్ అండ్ వొలెన్‌స్కీ అనే ప్రఖ్యాత రెస్టారెంట్ నిర్వహిస్తున్న పోటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆవును గెలుచుకోండి. ‘మూతి నుంచి తోక వరకు మొత్తం తినేయండి’ పేరుతో ఈ పోటీ జరుగుతోంది. గెలిచిన విజేతకు, అతని/అమె 19 మంది స్నేహితులకు ఆవును కోసి వండి వడ్డిస్తారు. దీనికి సంబంధించి ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియాలో ప్రకటన వస్తోంది. ఆవు తలను పోలిన మాంసం ముక్కను అందులో చూపుతోంది.


దీనిపై పెటా సహా పలు జంతుహక్కులు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాంసాహారం అమ్ముకుంటే అమ్ముకోండిగాని, ఒక జీవిని ఇంత ఘోరంగా పోటీకి పెట్టడమేంటని, మనమేమన్నా ఇంకా అనాగరిక దశలో ఉన్నామా అని ప్రశ్నిస్తున్నాయి. సృష్టిలో ప్రతిప్రాణికి జీవించే హక్కు ఉంటుందని, అయితే ఆహార అవసరాల కోసం వాటిని తిన్నా, కనీస గౌరవం ఇవ్వాలని అంటున్నాయి.