COWసు ఆవు !
ఎక్కడో కాలితే గుర్రం వరిగడ్డి మేస్తుందన్నట్టే ఈ ఆవును కూడా చూడండి ఎంచక్కా పచ్చి చేపల్ని పరపర ఎలా నమిలేస్తోందో !? పాపం దీనిక్కూడా ఆకలి బాగా అయినట్టుంది, తన యజమాని గడ్డి తెచ్చేవరకు ఓపిక పట్టలేదేమో కౌసు గివుసు అనకుండా ఎలా నమిలేస్తోందో కదా.. ‘ ఆకలి రుచి ఎరుగదు, అవసరం టైం ఎరుగదన్నట్టే ’ వుంది ఈ యవ్వారం. అసలే ఆవు సాధుజంతువు, అది గడ్డి తప్ప ఇంకేం ముట్టుకోదని మనందరికీ తెల్సిందే.
కానీ అది దాని సృష్ఠి ధర్మానికి విరుద్ధంగా ఇలా చేపల్ని తినడం బెంగాల్లో చాలా మందిని విస్మయానికి గురి చేస్తోంది. దీని మీద కొందరు సాంప్రదాయ వాదులు రకరకాల ఊహాగానాలను స్టేట్ మెంట్లుగా వదులుతుండొచ్చు గానీ ఒక్కసారి ఆ మెట్టు దిగి మాట్లాడితే తెలుస్తుంది ఎదుటివారి ఆకలి కేక ఎలా వుంటుందో.. ఈ ఆవు ఆకలిని ముందే పసిగట్టి దానికి గడ్డి వేసుంటే అతణ్ణి మనిషి అనొచ్చు , దాని ఆకలి గురించి అస్సలు తెలుసుకోకుండా అది నీసు తిందని నిందలు మోపి గొప్ప సాంప్రదాయవాదులనిపించుకుంటున్న చాలా మందికి ఈ ఆవు ఆకలి టేస్ట్ ఎలా వుంటుందో చెబుతోంది !