పిల్లలకు ఆవుపాలతో హాని.. 

చాలా మంది చిన్నపిల్లకు ఆవుపాలను ఆహారంగా ఇస్తుంటారు. కానీ పసిపల్లలకు ఈ పాలను ఇవ్వడం మంచిది కాని నిపుణులు చెబుతున్నారు. ఆవు పాలు పిల్లలకు జీర్ణం కావని, దీంతో  అలర్జీలు, శ్వాసకోశ, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. తల్లిపాలు లేని పిల్లలకు ప్రత్యామ్నాయంగాపోషక పదార్థాలను ఆహరంగా ఇవ్వాలని  సూచించారు.

ఏడాది లోపు పిల్లలకు  ఆవు పాలు ఇవ్వడం వలన  చిన్నపిల్లల మూత్రపిండాలపై ప్రభావం పడుతుందని పోషకాహార నిపుణుడు నందన్ జోషి తెలిపారు. ర్యాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్ (ఆర్ఎస్ఓసీ) ప్రకారం ..తల్లి పాలు లేని 42 శాతం మంది పిల్లలకు ఆవు లేదా ఇతర జంతువుల పాలను ఆహారంగా ఇస్తున్నారు.  దాంతో పిల్లలకు చర్మవ్యాదులు, వాంతులు, అతిాసారం, కడుపు నొప్పి, కోరింత దగ్గు , అతిగా ఏడవటం వంటి ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.

SHARE