ఆవుకు కర్మకాండ.. వెయ్యిమంది హాజరు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆవుకు కర్మకాండ.. వెయ్యిమంది హాజరు..

April 16, 2018

కొందరికి పెంపుడు జంతువులపై చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అవి చనిపోతే ఆ దు:ఖం నుంచి అంత త్వరగా బయటికిరాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కక్రా గ్రామానికి చెందిన దేవ్ ప్రకాశ్ శర్మ కూడా అలాంటివాడే. 13 ఏళ్లుగా ఎంతో ప్రేమతో పెంచుకున్న ఆవు చనిపోవడంతో ఆయన కుదేలయ్యాడు. చనిపోయిన మనిషికి జరిపినట్లే ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి ‘గౌరి’ని సాగనంపాడు. ఆదివారం దాని ఆత్మశాంతి కోసం దశదిన కర్మ కూడా అంతే ఘనంగా జరిపించాడు.

అ కార్యక్రమానికి రావాలని ఆహ్వానపత్రాలు అచ్చేయించి మరీ బంధుమిత్రులకు పంచిపెట్టారు. ఈ వేడుకకు వెయ్యిమందికిపైగా హాజరై గౌరిని స్మరించుకున్నారు. పురోహితులు పిండప్రదానం తదితర తంతులు పూర్తిచేశారు. దేవ్‌ప్రకాశ్ శర్మ 2004లో గౌరిని  రూ.2 వేల కొన్నాడు. ఇటీవల పాకలో విషపురుగులు కుట్టడంతో గౌరి చనిపోయింది. 1000 మంది హాజరయ్యారు.