ఆవు ఇక జాతీయ జంతువు - MicTv.in - Telugu News
mictv telugu

ఆవు ఇక జాతీయ జంతువు

November 27, 2017

ఊహించినట్లుగానే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు. ఆదివారం ఉడిపిలో జరిగిన ధర్మ్ సంసద్ కార్యక్రమంలో సాధుసంతులు ఆవుల పరిరక్షణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గోవుల రక్షణ, ఎగుమతి చేసే మాంసానికి డీఎన్ఏ పరీక్ష, గోరక్షులపై కేసుల ఎత్తివేత, గోమంత్రాయం ఏర్పాటు, గోవధపై నిషేధం తదితర డిమాండ్లతో ఒక తీర్మానం చేశారు. సదస్సు తర్వాత విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సహాయ కార్యదర్శి సురేంద్ర కుమార్ జైన్ విలేకర్లతో మాట్లాడారు.

చాలామంది గోవధకు పాల్పడుతున్నారని, మరోపక్క.. గోవులను కాపాడుతున్న హిందూ యువకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ‘ప్రభుత్వాన్ని ఏం చేసైనా సరే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా చేస్తాం.. ’ అని అన్నారు.

దేశంలో చాలా రాష్ట్రాలు గోవధను నిషేధించాయని, అయితే కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీఫ్ పార్టీలు ఏర్పాటు చేసి హిందువుల మనోభావాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. వినోభావావే, గాంధీ, శంకరాచార్య వంటి వారందరూ బీఫ్‌కు వ్యతిరేకమన్నారు. ఆవులను చంపి ఆ మాంసాన్ని దున్నమాంసం, గొర్రె మాంసం పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, దీన్ని అరికట్టేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.