ఆ ఆవుకు.. పాటలంటే పరమ పిచ్చి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఆవుకు.. పాటలంటే పరమ పిచ్చి..

December 4, 2017

పాటలంటే మూగజీవాలకు కూడా ఇష్టమే. ఇది పాత సంగతే. అయితే పాటలంటే పిచ్చిగా పడి చచ్చే జంతువులు వుండవు. కానీ ఈ ఆవు అలాంటిదే. దీనికి పాటలు లేనిదే పూట గడవదు. అది కూడా మామూలు పాటలు కాదు.. కేవలం భక్తి పాటలు మాత్రమే వింటుంది.

ఈ చిత్రమైన ఆవు ఎక్కడో కాదు, మన నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉంది. కొల్లిపర శ్రీకాంత్‌ రెండేళ్ల కింద ఈ ఒంగోలు జాతి ఆవును  రూ.28 వేలకు కొన్నాడు. గౌరి అని పేరు పెట్టారు. ఆ ఊర్లో పెద్ద రామాలయం ఉంది. తెల్లారుజామున 4.30 గంటలు కాగానే అక్కడ భక్తి పాటలు పెడుతుంటారు. గౌరి వాటిని  వింటుండేది. అలవాటుగా మారిపోయింది. రోజూ అక్కడికెళ్లి రెండు గంటల పాటు పాటలు వింటూ గడిపేది. పాటలు ఆపేశాక… ఇంటికొచ్చేది. అయితే కోపంతో దారిలో ఇళ్ల ముందు ఉన్న మంచాలు, బకెట్లు, ఇతర వస్తువులను చిందర వందర చేసేది. కొన్నింటిని విరగ్గొట్టేది.దీంతో ఏం చేయాలో తెలియక శ్రీకాంత్‌ తలపట్టుకొనే వాడు. తర్వాత ఒక ఆలోచన వచ్చింది. సెల్ ఫోన్ కొని అందులోని మెమొరీ కార్డులో భక్తిగీతాలు రికార్డు చేయించాడు. ఆ ఫోన్‌లో పాటలు పెట్టి ఆవు మెడకు కట్టేశాడు. దీంతో గౌరి ఎక్కడికీ కదలకుండా ఇంటి వద్దే ఉంటోంది. పొద్దున రెండు గంటలు, మధ్యాహ్నం ఒక గంట, సాయంత్రం రెండు గంటలు పాటలు వింటూ మర్యాదగా ఉంటోంది. పాటలు వింటూ భక్తిపరశవంతో తలను ఆడిస్తూ ఉంటుంది. పాటలు ఆపేస్తే మంటుకు కోపంతో రెచ్చిపోతుంది. వస్తువులన్నీ పడేస్తుంది. భక్తి పాటలు కాకుండా వేరే గీతాలు పెట్టినా ఇలాగే చేస్తుంది.