మన దేశంలో ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరులు మద్యం, పెట్రోల్. వీటి నుంచి ఎంత పిండుకంటే అంతగా ఖజానా గల్లుగల్లుమంటుంది. మద్యం ఉత్పత్తి ఖర్చుకంటే మార్కెట్ ధర ఎన్నెన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. లోటు బడ్జెట్ పూడ్చుకోవడానికి మొదటి గుదిబండను మద్యంపై వేయడం మామూలైపోయింది. ధరలను ఎంత పెంచినా మందుబాబులు కొనక తప్పని పరిస్థితి. నోట్లో చుక్క పడకపోతే ప్రాణం విలవిల్లాడుంది కనక ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుని మరీ సీసాలు తెచ్చుకుంటారు. ఈ బలహీనతను కనిపెట్టిన ప్రభుత్వాలు నానా పన్నులతో మందుబాబులను చావగొడుతుంటాయి. సెస్సులు అని వీటికి ముద్దుపేరు పెట్టినా సారాంశం జేబు దోపిడే.
ఎందుకు?
హిమాచల్ ప్రభుత్వం మరో ఆకు ఎక్కవ చదివి.. ఆవును అడ్డుపెట్టి భారీ దోపిడీకి తెరతీసింది. ఇక నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ‘ఆవు పన్ను’(కౌ సెస్) వసూలు చేస్తామని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో ఈమేరకు ఆయన ప్రకటన చేశారు. ఒక్కో మందు సీసాపై రూ. 10 చొప్పున గోవు పన్ను వసూలు చేసి, గోమాతల సంరక్షణకు వాడుతామని చెప్పారు. కౌ సెస్ ద్వారా సర్కారీ గల్లాపెట్టకు ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పుకొచ్చారు. అన్ని బడ్జెట్లలో ఉన్నట్టే అన్ని వర్గాలకు కూడా ఆయన తాయిలాలు ప్రకటించారు. 20 వేల మంది బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు కోసం, రూ.25,000 చొప్పు సబ్సిడీని అందిస్తామన్నారు. ఆడవాళ్లకు లకు 1500 నగదు ఇసతామని, దీని కోసం 416 కోట్లు ఖర్చువుతుందాని వెల్లడించారు.
ఇంకా ఎక్కడెక్కడ?
వినడానికి వింతగా ఉన్నా ఆవు పన్ను మన దేశానికి కొత్తేమీ కాదు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే కౌ సెస్సును జేబులు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను బట్టి 2 నుంచి 20 దీనికి కింద వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానిక పరిపాలన సంస్థలు వడ్డిస్తున్నయి. పంజాబ్‌లో విలాసవంతమైన వస్తువులపై ఈ పన్నును విధింస్తున్నారు. రోడ్లపై ఊర పశువులు తిరగడం వల్ల యాక్సిడెంట్లు జరిగి వేలమంది చనిపోతున్నారని, వాటిని పోషించడానికి ఈ పన్ను తప్పనిసరి అని ప్రభుత్వం వాదిస్తోంది. వీధి పశువుల సంరక్షణకు భారీస్థాయిలో నిధులు కూడా సమకూరుస్తోంది. పంజాబ్ లో ఆవు పన్ను కింద కార్లపై 1,000 , టూవీలర్లపై 500, విదేశీ మద్యంపై సీసాకు 10, రాష్ట్రంలో తయారయ్యే లిక్కరుకైతే సీసాకు 5 వసూలు చేస్తున్నారు. చండీగఢ్, రాజస్తాన్ లలోనూ ఈ బాదుడు ఉంది. ఉత్తరప్రదేశ్ లో పశు సంరక్షణ పేరుతో కేవలం 2 శాతం వాత పెడుతున్నారు. వందకోట్లతో గోశాలలను నిర్మించిన రాష్ట్రంగా యూపీ రికార్డుకెక్కింది.