11 మంది గోరక్షకులకు జీవితఖైదు - MicTv.in - Telugu News
mictv telugu

11 మంది గోరక్షకులకు జీవితఖైదు

March 21, 2018

గోరక్షణ పేరుతో ఓ ముస్లింను కొట్టిచంపిన ముష్కరులకు కోర్టు యావజ్జీవ జైలు శిక్ష విధించింది. జార్ఖండ్‌లోని రాంఘర్ జిల్లాలో గత ఏడాది జూన్‌లో జరిగిన అలీముద్దీన్ అన్సారీ హత్య కేసులో జిల్లా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

12మంది నిందితుల్లో 11 మందిని దోషులుగా తేల్చి శిక్ష వేసింది. అలాగే మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. శిక్ష పడినవారిలో బీజేపీ జిల్లా మీడియా ఇన్‌చార్జి కూడా ఉన్నాడు. గోరక్షకుల దాడి కేసులో శిక్ష పడడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

అలీముద్దీన్ తన వ్యానులో గోమాంసాన్నీ తీసుకెళ్తుండగా స్థానిక గోరక్షా సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. అతన్ని తీవ్రంగా కొట్టి చంపేశారు. వ్యానును కూడా దహనం చేశారు. గోరక్ష పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన రోజే ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందుతుల్లో ఒక మైనర్ ఉన్నాడు. అతని కేసుపై విచారణ వాయిదా పడింది.