ఆవులకు ఉన్న రక్షణ ఆడవాళ్లకు లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆవులకు ఉన్న రక్షణ ఆడవాళ్లకు లేదు..

December 9, 2017

దేశంలో గోరక్షణ పేరుతో అమాయకులను, మైనారిటీ ప్రజలను దారుణంగా చంపుతున్నారని సీపీఎం నాయకురాలు, ఐద్వా నేత బృందా కారత్ నిప్పులు చెరిగారు. ఆవులకు ఉన్న రక్షణ ఆడవాళ్లకు లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. ‘సేవ్ ఇండియా’ పేరుతో శుక్రవారం ఢిల్లీలో ఐద్వా సదస్సు జరిగింది. యాసిడ్ దాడులు, అత్యాచారాలు వంటి దారుణాలకు గురైన మహిళలు పాల్గొన్నారు.

బృంద మాట్లాడుతూ.. ‘దేశం అసహనపూరిత వాతావరణం, మహిళలపై హింస పెరిగిపోతోంది. ఆవులను గోవులను తరలిస్తున్నారంటూ హిందూత్వ శక్తులు అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి.  మరోపక్క.. దేశంలో మహిళలపై, బాలికలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. నిర్భయ నిధిని ఖర్చు చేయకుండా దారి మళ్లించారు. కోట్లు పెట్టి ఆవుల కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. హిందుత్వం పేరుతో బీజేపీ, సంఘీలు దేశాన్ని నాశనం చేస్తున్నారు.. ’ అని ఆమె విరుచుకుపడ్డారు.