కౌఫీలతో వెబ్‌సైట్ క్రాష్ - MicTv.in - Telugu News
mictv telugu

కౌఫీలతో వెబ్‌సైట్ క్రాష్

November 2, 2017

సెల్ఫీ పోయె.. కౌఫీ వచ్చె ఢాం.. ఢాం.. పాట తెలుసు కదా మీకు. కౌతో.. అదేనండి.. కౌ.. అనగా ఆవుతో సెల్ఫీ తీసుకుంటే కౌఫీ అంటారని. కౌఫీలతో గోవుల పరిరక్షణ కోసం ప్రచారం చేస్తున్న గోపరివార్. ఆర్గ్ అనే సంస్థ ఇప్పుడు పెద్ద చిక్కులో పడింది.

బెస్ట్ కౌఫీ అవార్డు కోసం ఈ వెబ్‌సైట్ నిర్వహిస్తున్న సెల్ఫీ విత్ గోమాతా పోటీకీ కుప్పల కొద్దీ కౌఫీలు వచ్చిపడుతున్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక  వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది. సమస్యను చక్కదిద్దడానికి కొత్త సర్వర్లు వాడుతున్నారు. డిసెంబర్ 31 వరకు ఈ పోటీ ఉంటుంది. కోల్ కతాలోని గోసేవాపరివార్ అనే స్వచ్ఛం సంస్థ ఈ పోటీని నిర్వహిస్తోంది. దేశంలో గోవుల పరిరక్షణకు, ముఖ్యంగా అనాథ ఆవుల సంరక్షణ కోసం తమ సంస్థ కౌఫీల ద్వారా కృషి చేస్తోందని గోసేవా పరివార్ ప్రతినిధి అభిషేక్ ప్రతాప్ సింగ్ చెప్పారు. అయితే సెల్ఫీ పిచ్చి ముదిరి కౌఫీగా మారిందనే విమర్శలూ వస్తున్నాయి. సెల్ఫీ మరణాలు మనదేశంలోనే ఎక్కువ జరుగుతున్న సంగతి తెలిసిందే.