మహిళా బాక్సర్లకు రివార్డుగా ఆవులు - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా బాక్సర్లకు రివార్డుగా ఆవులు

December 1, 2017

ఇంతవరకు మనం ఏదైనా ఆటలో ఎవరైనా గెలిస్తే రివార్డ్ కింద ప్రభుత్వాలు.. వాళ్లకు డబ్బులో, లేక స్థలాలో ,కార్లో బంగ్లాలో ఇచ్చేవారు. కానీ హర్యాణా ప్రభుత్వం మహిళా బాక్సర్ల కోసం వినూతన రివార్డులను ఇవ్వనుంది. ప్రపంచయూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన భారత మహిళా బాక్సర్లకు..రివార్డ్ కింద దేశీ ఆవులను ఇవ్వనున్నట్లు హరియాణా వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.స్వచ్చమైన పాలు త్రాగి..బాక్సర్లంతా ఇంకా దృడంగా తయారవుతారనే ఉద్యేశ్యంతో ఆవులను ఇస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గత నెలలో జరిగిన టోర్నీలో నీతూ,సాక్షి, జ్యోతి, శశిలు బంగారు పతకాలు సాధించారు. అనుపమా, నేహాలు కాంస్య పతకాలు సాధించారు. ఐదు స్వర్ణాలు, రెండు కాంస్యాలు గెలిచిన మహిళా బాక్సర్లకు ,వారికిచ్చే దేశీ ఆవుల ద్వారా మరింత దృడంగా తయారయ్యి మనదేశానికి ఇంకా మంచిపేరు తీసుకురావాలని కోరుకుంటున్నామని హరియాణా ప్రభుత్వం తెలిపింది.