Cows in Velugodu reservoir in nandyal District Andhra Pradesh
mictv telugu

హమ్మయ్య.. రిజర్వాయర్‌లోకి వెళ్లిన 350 ఆవులు సేఫ్

July 23, 2022

వందలాది ఆవుల ప్రాణాలు దక్కాయి. అడవిపందుల దాడికి బెదిరి వెలుగోడు రిజర్వాయరులోకి వెళ్లిపోయిన మూగజీవాలను మత్స్యకారులు ఎట్టకేలకు బయటికి తీసుకొచ్చారు. తెప్పల్లో వెళ్లి ఆవులను అదిలించి ఒడ్డుకు పట్టుకొచ్చారు. దీంతో వాటి యజమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఆవులు రిజర్వాయరులో చనిపోయివుంటే చాలా సమస్యలు తలెత్తేవి.

ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న ఈ రిజర్వాయరు దగ్గర్లో ఆవులు మేత మేస్తుండగా అడవి పందులు దూసుకొచ్చాయి. బెదిరిపోయిన గోవులు జలాశయంలోకి పరుగులు తీశాయి. నదిలో మొసళ్లు ఉండడంతోపాటు, ఆవులు ఈది ఈది అలసిపోయి చచ్చిపోతాయేమోనని పాడిరైతులు ఆందోళన పడ్డారు. ప్రాజెక్టు అధికారులు జాలర్ల సాయంతో వాటిని ఒడ్డుకు తీసుకొచ్చారు.