తమిళిసై తెలంగాణను విడిచిపెట్టాలి
తెలంగాణలో గత కొంత కాలంగా సర్కార్ vs గవర్నర్ అంశం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ బిల్లులపై గవర్నర్, సర్కార్ మధ్య వివాదం నడుస్తోంది. పెండింగ్ బిల్లులపై చర్చించేందుకు రాజ్ భవన్‌కు రావాలని యూజీసీ, విద్యాశాఖలకు గవర్నర్ సూచించారు.
ఈ క్రమంలోనే దేశంలోని గవర్నర్ వ్యవస్థపై సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి..తెలంగాణ గవర్నర్ తిమిళిసై రాష్ట్ర వదిలి వెళ్లిపోవాలని సాంబశివరావు డిమాండ్ చేసారు. మంత్రులను రాజభవన్ చుట్టూ తిప్పించుకుంటున్నానను అంటూ వ్యాఖ్యానించిన తమిళిసై గవర్నర్‌గా పనిచేస్తున్నారా? లేక బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. అసలు గవర్నర్ వ్యవస్థ మొత్తాన్ని రద్దుచేయాలన్నారు. తెలంగాణలోనే కాదు తమిళనాడు, కేరళ, ఢిల్లీల్లో గవర్నర్ల తీరు సరిగాలేదంటూ విమర్శించర్శించిన సీపీఐ కార్యదర్శి తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరు సరిగా లేదని త్వరలోనే రాజభవన్ ను ముట్టడిస్తామని తెలిపారు.