ఆర్టీసీ సమ్మె..సీపీఐ నేత కూనంనేని ఆమరణ దీక్ష - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మె..సీపీఐ నేత కూనంనేని ఆమరణ దీక్ష

October 26, 2019

 

sambasiva rao................

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 22వ రోజుకి చేరింది. ఈరోజు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మఖ్దూంభవన్‌ వద్ద ఆమరణ దీక్షకు దిగారు. ఈ దీక్షను పార్టీ సీనియర్‌ నేత సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ…ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు సీఎం కేసీఆర్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. 

తదనంతరం కూనంనేని మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానన్నారు. ఉద్యమంలో లేని వారే కేసీఆర్‌ వెంట ఉన్నారన్నారు. ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి మొదట తానే మద్దతు తెలిపానని కూనంనేని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సహకరించిన ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్‌ ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఎవరు సమ్మె చేస్తే వారిని తీసివేస్తామని హెచ్చరించడం సరికాదన్నారు.