CPI leader Narayana said that they were fighting legally for housing for the poor
mictv telugu

తెలంగాణలో సాయుధ పోరాటం చేస్తాం.. సీపీఐ నారాయణ

June 13, 2022

CPI leader Narayana said that they were fighting legally for housing for the poor

సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే వరంగల్‌లో పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ. సోమవారం ఉదయం బాలసముద్రం ఏకశిలా పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో పాల్గొన్న ఆయన.. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కావాలని న్యాయబద్ధంగా పోరాడుతున్నామని తెలిపారు. ఆత్మగౌరవం కోసం సీపీఐ పోరాడుతోందన్నారు. భూసమస్యలు పరిష్కారం కాకపోతే తుపాకులు చేతపడుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేదలకు అండగా ఉండల్సిన ప్రభుత్వం ల్యాండ్ మాఫియాతో చేతులు కలుపుతోందన్నారు. ప్రభుత్వం ల్యాండ్ మాఫియాకు సహకరిస్తే తమతో యుద్దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కాపాడడానికి వస్తే తమపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వంతో చావో, రేవో తేల్చుకుంటాం… ఉంటే గుడిసెలో లేకుంటే జైల్లో ఉంటాం’’ అంటూ స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టి పేదలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.