CPI Narayana apologized to Chiru fans
mictv telugu

చిరు ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన సీపీఐ నారాయణ.. మర్చిపోవాలని అర్ధింపు

July 20, 2022

మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు సీపీఐ నారాయణ వెల్లడించారు. తాను వాడిన పదాల పట్ల చింతిస్తున్నానని, ఈ విషయాన్ని మెగా అభిమానులు, కాపునాడు నేతలు ఇంతటితో మర్చిపోవాలని కోరారు. ‘నేను వివాదాలు సృష్టించే వ్యక్తిని కాదు. అలాగని నన్ను నేను సమర్ధించుకోవట్లేదు. నేను వాడిన పదాన్ని భాషా దోషంగా పరిగణిస్తున్నాను. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి విమర్శలను స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ఇకనుంచి మనం వరద బాధితులను ఆదుకోవడానికి పని చేద్దామ’ని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవికి బదులు సూపర్ స్టార్ క‌ృష్ణను పిలవాల్సిందని, చిరంజీవి రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరవెల్లి.. చిల్లర బేరగాడని విమర్శించారు. అలాగే పవన్ కల్యాణ్ ఒక ల్యాండ్ మైన్ లాంటి వాడని, ఎప్పుడు ఎవరిమీద పేలుతాడో తెలియదని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా మెగా అభిమానులతో పాటు నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడ్డి తింటున్న నారాయణ చేత అది మాన్పించి అన్నం తినే అలవాటు నేర్పాలంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.