Cpi Narayana Controversial Comments Again On Bigg Boss Show
mictv telugu

బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చిన వాళ్లు పతివ్రతలంటే ఎవరూ నమ్మరు.. నారాయణ

September 8, 2022

బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైన ప్రతిసారి.. సీపీఐ లీడర్ నారాయణ ఆ షో ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు. ఆ షో వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదని చెబుతుంటారు. అదొక రెడ్ లైట్ ఏరియా, బ్రోతల్ హౌస్ అంటూ ఈ మధ్యనే విరుచుకుపడ్డారు. ఆ షోను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గత సీజన్‌లు కంటెస్ట్ చేసిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్.. నారాయణ మాటల్ని ఖండించారు.

అతనితో చేసిన డిబేట్ లో మాట్లాడుతూ… ‘బిగ్ బాస్ హౌస్‌కి నేనూ వెళ్లి వచ్చాను.. అక్కడ ఇలాంటివి ఏమీ జరగవు. కామెంట్స్‌‌ని వెనక్కి తీసుకుంటారా? లేదా? ‘అని అడగ్గా నారాయణ ఫైర్ అయ్యారు. ‘మీ ఇంట్లో ముక్కుమొహం తెలియని 20 మంది అమ్మాయిలు అబ్బాయిల్ని తలుపు వేసిపెట్టి.. వాళ్లని ఊరంతా ఏమంటారో వెళ్లి కనుక్కో.. ఆ ఇంటిని కూడా బ్రోతల్ హౌస్ అంటారు. బిగ్ బాస్‌లోకి వెళ్లి.. వందరోజులు అక్కడ ఉండి.. నేను చాలా పతివ్రతని అంటే ఎవరు నమ్ముతారబ్బా.. కెమెరాలు ఉన్నాయి అంటే కెమెరాల్లో చూపిస్తారా? ఇలాంటివి? నేను చాలా చూశాను.. 24 గంటలూ లైవ్‌లు పెట్టరు.. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుసు’ అని అన్నారు. ‘పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు హౌస్‌లోకి వెళ్లి.. లోపల ఏం చేసుకుంటున్నారు? ఏం జరుగుతుందో ఓపెన్‌గా చూపిస్తారా? అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు?’ అని నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.