నారాయణ నారయణ అవేం మాటలు..! - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణ నారయణ అవేం మాటలు..!

August 1, 2017

ఈరాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే 60 ఏళ్ల  పోరాట ఫలితాలను అనుభవిస్తుంది, విశ్వాస కుక్కగా కేసీఆర్ కేంద్రానికి అనుకూలంగా వున్నాడు..48వేల కోట్ల రూపాయలు కేవలం సిరిసిల్ల లోని ఇసుక రవాణా ద్వారా ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం ఎక్కడికి పోతుంది.సాక్షాదారాలతో  నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోని 17 చోట్ల…దళితుల పై దాడులు జరుగుతున్నాయి,అమిత్ షా ఓ పెద్ద దొంగ.ఇక మోడీ రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నాడు.కవితకు మంత్రి పదవికోసం కెసిఆర్ కేంద్రానికి దాసోహం అయ్యాడు. ప్రపంచంలో కేసీఆర్ లాంటి మోసగాడు ఎవడు ఉండడు,..ఇవ్వన్ని అన్నది ఎవరో కాదు సీపీఐ నేత నారాయణ. అంతేకాదు కేసీఆర్ నియంత్ర పాలనకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చింది.సైనికులుగా మనం ఉద్యమాలు చేయాలి అని అందరికి పిలుపునిచ్చారు.