CPI Narayana inspected Rishikonda excavations in vizag
mictv telugu

రిషికొండను ప్రభుత్వం రేప్ చేసింది.. సీపీఐ నారాయణ

November 25, 2022

CPI Narayana inspected Rishikonda excavations in vizag

విశాఖలోని రిషికొండను సీపీఐ నారాయణ శుక్రవారం సందర్శించారు. గతంలో వెళ్లేందుకు ప్రయత్నించిన నారాయణను పోలీసులు అడ్డుకోగా, హైకోర్టును ఆశ్రయించడంతో అనుమతి లభించింది. ఈ నేఫథ్యంలో రిషి కొండను సందర్శించిన నారాయణ టూరిజం శాఖ అధికారుల అనుమతి తీసుకొని తవ్వకాలను పరిశీలించారు.

అనంతరం మీడియతో మాట్లాడుతూ.. చట్టప్రకారమే కొండను తవ్వుతున్నా అది నేరమని అభిప్రాయపడ్డారు. ఇక్కడ సీఎం కార్యాలయం కట్టట్లేదు కానీ విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్నారని వెల్లడించారు. విల్లాలు కావాలంటే అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో కట్టుకోవచ్చని, కొండను తవ్వడం మాత్రం క్షమించరాని నేరమని తెలిపారు. నిర్మాణంలో ఉన్న విల్లాలు పర్యాటకుల కోసమేనని స్పష్టం చేశారు. కొందరు మిత్రులు మిడి మిడి జ్ఞానంతో మాట్లాడడం వల్లే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయని అన్నారు. ఇక కొండను తవ్వడాన్ని మాత్రం నారాయణ తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వ పెద్దలు పర్యావరణాన్ని రేప్ చేస్తున్నారంటూ తీవ్రంగా స్పందించారు. సుమారు 50 ఎకరాల్లో తవ్వకాలు చేశారని, కొండను తవ్వి పిలకను మాత్రం ఉంచారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఏం చేసినా పాడు చేసిన ప్రకృతి మాత్రం రాదని ఆవేదన వ్యక్తం చేశారు.