ఆ ఎగురుడు ... దుంకుండేంది సారు... - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఎగురుడు … దుంకుండేంది సారు…

June 27, 2017

 

నారాయణ… నారాయణ….  సిపిఐ పెద్ద లీడర్ నారాయణ సారుకు నాల్కెనే గాదు.. కాళ్లు చేతులు కూడా కతర్నాకే. ఇంతకు ముందు తోచిందల్లా మాట్లాడినా…. ఏదో బోళా మనిషిలే అనుకున్నారు.  వయస్సు మీదపడుతున్నదనే సోయి లేనట్లుంది. నోరుతో ఎంత మటన్నా  గాలికి పోతుందనుకోవచ్చు. కానీ కాళ్లు, చేతులకు కూడా శక్తికి మించిన పనిచేప్తే ఎంత నష్టం… ఎంత కష్టం. విశాఖ జిల్లా  కొమ్మాది వద్ద ఆక్రమణకు  గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించేందుకు… వీలైతే పాతేందుకు నాలుగు  ఎర్ర జెండాలు.. కార్యకర్తలను ఎంట  ఏస్కోని పోయిండు. పోయినరు మంచిదే  కానీ… ఆ ఎగురుడు … దుంకుండేంది…

ఈ వయస్సుల తంతే రాళ్లుకూడా పిండి కావాల్ననని… ఏదో మాట  వరుసకు  పెద్దోల్లు.. సోర పిల్లగాండ్లను అంటరు. సిన్నప్పుడు ఎవరో ఈయన తాన ఆ మాట అన్నట్లుంది… అది బాగా గుర్తు వెట్టుకోని ఇన్ని రోజుల తర్వాత ఆ ఈర తీద్దమని సిమెంట్ గోడను పెక్కున తంతే…. కాలు వోయి దాంట్ల ఇరుకున్నది. పార్టీ బలంగా ఉన్నా లేకున్నా… నీ కాళ్లల్ల మస్తుగ  సత్తువున్నది. కానీ  అట్ల  ఎగిరెగిరి తంతే…. సారుకు  సక్కన దవాఖానకు పోవాల్సి వచ్చింది.

అయినా    కామ్రెడ్ నారాయణ  వయస్సు పెరుగుతున్నది….  జెర్రకంత  సోంచాయించు… ముందుల ముందుల మీరు చానా పనులు చేయాల్సి ఉంది… చేయాల్సిన ధర్నాలు…  రాస్తారోకోలు… పేల్చాల్సిన డైలాగులు చానా ఉన్నవి. ప్లీజ్  కామ్రెడ్ కాళ్లకు, చేతులకు దెబ్బలు తగిలించుకోకు.

ఇంతకు ముందో సారి గాంధీ జయంతి నాడు  ఇడ్లీ చికెన్ తిని… యేడాది పాటు చికెన్ ముట్టనని చెప్తివి. నాల్కెలు కోస్త… చెవులు కోస్త…. అబ్బో… మీరు చేసిన పోలికలు… ఉపమానాలు… ఏ భాషల చెప్పినా తక్వనే కని… కాళ్లు, చేతులు మాత్రం  మీవే గీ ముచ్చట యాదివెట్టుకో సాలు.

అయినా గూడ  మీరెన్ని తిట్లు తిట్టినా… ఏం పోస్టింగ్ లు ఫేస్ బుక్కల వెట్టిన మస్తుగ లైక్ లు కొడ్తిమి. ఈ నడ్మ వీడియోలు తీసి పంపుతున్నరు… చూసి ఆనందిస్తమి… దాన్ని షేర్లు చేస్తేమి… ఎప్పుడూ కామెడీయే అయితే ఎట్లా అని ఈ బాహుబలి ఫైటింగ్ సీన్లు మాత్రం పెటొద్దు. ఇంకో నాలుగు దినాలు ఇంట్లనే ఉండి రెస్టు తీస్కోండి… మల్లా ధర్నాలు  చేసే నాటికి మంచిగ  కావాలే. జెర పైలం కామ్రెడ్ నారాయణ గారు.