సీపీఐ నారాయణ భార్య కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

సీపీఐ నారాయణ భార్య కన్నుమూత

April 14, 2022

 thirupathi

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతి దేవి (65) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచారు. శుక్రవారం నగరి మండలం ఐనంబాకంలో వసుమతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న పలు పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, ఈ రోజు ఉదయమే నారాయణ తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో తిరుపతి డిపో ముందు నిరసనకు దిగారు. పెంచిన ఆర్టీసీ, డీజిల్, పెట్రోల్ ధరలను  తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.