హైదరాబాద్‌లో దీపావళి.. కంటికి గాయాలతో సరోజినీ హాస్పిటల్‌కు..  - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో దీపావళి.. కంటికి గాయాలతో సరోజినీ హాస్పిటల్‌కు.. 

October 28, 2019

Cracker .

దీపావళి పండగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద అంతా టపాకాయలు కాలుస్తూ సంతోషాలను పంచుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇవి ప్రమాదాలు కారణం అవుతుంటాయి. జాగ్రత్తలు పాటించాలని ఎన్ని సూచనలు చేసినా ప్రతి ఏటా ప్రమాదాల భారిన పడిన వారి సంఖ్య నమోదు అవుతూనే ఉంది. కళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కంటి సమస్యలు తలెత్తున్నాయి. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పలు ప్రాంతాల్లో అపశృతి చోటు చేసుంది. 

నగరం అంతటా దీపావళి వేడుకల్లో ఘనంగా జరిగాయి. దీపాల వెలుగులు, టపాకాయల మోతల మధ్య నగరవాసులు వేడుకలు చేసుకున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా టపాసులు కాలుస్తుండగా పలు ప్రాంతాల్లో పలువురు గాయపడ్డారు. కళ్లకు గాయాలతో 20 మంది బాధితులు మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చేరారు. ముగ్గురికి అత్యవసర చికిత్స చేయగా, మిగితా వారికి చిన్నపాటి పరీక్షలు చేసి పంపించేసినట్టు వైద్యులు తెలిపారు.