Home > Featured > టాలీవుడ్‌లో పెళ్లి గోల.. సింగిల్స్ మింగిల్స్ అంటూ కౌంటర్లు

టాలీవుడ్‌లో పెళ్లి గోల.. సింగిల్స్ మింగిల్స్ అంటూ కౌంటర్లు

singel

టాలీవుడ్‌లో యంగ్ హీరోల మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు నడుస్తున్నాయి. హీరోలంతా పెళ్లిలపై స్పందిస్తున్నారు. సింగిల్స్, మింగిల్స్ అంటూ మెగా యంగ్ హీరోలు, నితిన్ మధ్య జరిగిన ట్వీట్లు తెగ ట్రోల్ అవుతున్నాయి. దీనికి తోడు ‘నో మ్యారేజ్’ అంటూ వచ్చిన సోలో లైఫ్ సో బెటర్ సినిమా పాటు అందరిని తెగ ఆట్టుకుంటోంది. దీన్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోయే నితిన్ చేతుల మీదుగా విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగానే మెగా హీరోల పెళ్లిపై నితిన్ ఆసక్తికర కామెంట్ చేయగా.. దానికి వారు కూడా అదే స్థాయిలో రిప్లే ఇచ్చారు.

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కలిసి ఇటీవల పెళ్లిపై ఓ సాంగ్ తీశారు. సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం దీన్ని తీయగా..ఈ పాటను నితిన్‌తో తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిలీజ్ చేయించారు. సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉదంటూనే.. ‘పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావో నేనూ చూస్తా.. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ.. చేసుకోవడం మాత్రం పక్కా’ అంటూ సాయి ధరమ్ తేజ్‌ని ఉద్ధేశించి వ్యాఖ్యానించాడు. దీనిపై వెంటనే స్పందించిన సాయి ధరమ్‌ తేజ్‌.. ‘నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను బ్రదర్‌, ట్రెండ్‌ సెట్‌ చేస్తా. మింగిల్‌ అయినా కూడా మా లాంటి సింగిల్స్‌ కోసం ఈ సాంగ్‌ లాంచ్‌ చేసినందుకు థ్యాంక్యూ డార్లింగ్‌’ అంటూ అదే స్థాయిలో రిప్లే ఇచ్చాడు. కాగా సోలో లైఫ్ సో బెటర్ సినిమా మే 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Updated : 25 May 2020 11:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top