Credit card is used by the tribe: RBI
mictv telugu

క్రెడిట్‌ కార్డ్‌‌ను తెగ వాడేస్తున్నారు: ఆర్‌బీఐ

June 29, 2022

Credit card is used by the tribe: RBI

భారతదేశంలో వినియోగదారులు క్రెడిట్ కార్డును తెగ వాడేస్తున్నారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. క్రెడిట్‌ కార్డుల ద్వారా జరుగుతున్న లావాదేవీలకు సంబంధించిన నివేదికను ఆర్‌బీఐ విడుదల చేసింది. గత నెలలో ఆన్‌లైన్‌లో జరిగిన కొనుగోళ్లతో పోలిస్తే, తాజాగా క్రెడిట్‌ కార్డుల వినియోగం అంతకంతకు పెరుగిందని పేర్కొంది.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం..” మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్‌ కార్డ్‌ వినియోగదార్లు ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల కోసం రూ.71,429 కోట్లు చెల్లించారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్ల వద్ద రూ.42,266 కోట్ల లావాదేవీలు జరిపారు. ఆన్‌లైన్‌లో 11.5 కోట్లు, పీవోఎస్‌ మెషీన్ల (ఆఫ్‌లైన్‌) వద్ద 12.2 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆఫ్‌లైన్‌ కంటే ఆన్‌లైన్‌లో అధిక విలువ కలిగిన చెల్లింపులు జరిగాయి. ఏప్రిల్‌ నెలలో క్రెడిట్‌ కార్డ్‌ కస్టమర్లు ఆన్‌లైన్‌ లావాదేవీలకై రూ.65,652 కోట్లు చెల్లించారు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్ల వద్ద వీరు రూ.39,806 కోట్ల లావాదేవీలు జరిపారు. డెబిట్‌ కార్డులతో వినియోగదార్లు ఆన్‌లైన్, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్ల వద్ద డెబిట్‌ కార్డుల ద్వారా ఏప్రిల్‌ నెలలో రూ.65,957 కోట్ల లావాదేవీలు జరిపారు” అని వివరాలను వెల్లడించింది.

ఇక, మే నెల విషయానికొస్తే.. డెబిట్‌ కార్డులతో పీవోఎస్‌ ద్వారా రూ.44,305 కోట్లు, ఈ–కామర్స్‌ కోసం రూ.21,104 కోట్లు ఖర్చు చేశారని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌లో క్రెడిట్‌ కార్డు కలిగిన వారు 7.51 కోట్లు ఉండగా, మే నెలలో 20 లక్షల మంది కొత్తగా తోడయ్యారని తెలిపింది.

అయితే, సంఖ్య పరంగా అత్యధిక క్రెడిట్‌ కార్డులను జారీ చేసిన బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ 1.72 కోట్లతో ముందంజలో ఉందని, మే నాటికి జారీ చేసిన క్రెడిట్‌ కార్డుల సంఖ్య స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1.41 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.33 కోట్లుగా ఉంది అని ఆర్‌బీఐ అధికారులు వివరాలను వెల్లడించారు.