తమిళ హీరో దళపతి విజయ్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న సినిమా ‘బీస్ట్’. తాజాగా ఈ మూవీ నుంచి ‘హలమిత్తి హబీబో’ అనే సాంగ్ సోషల్ మీడియా వేదికగా రిలీజు అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలో హీరో విజయ్, పుజా హెగ్డే వేసిన స్టెప్పులు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. పాట పూర్తిగా అరబిక్ స్టైల్ ఉంటుంది. అంతేకాదు ఈ పాట లిరిక్ కూడా అరబిక్ అండ్ తమిళ్ కలిసిన పదాలతో ఫ్యూజన్ స్టైల్లో అదరగొట్టారు. దాంతో ఈ పాట జెట్ స్పీడ్లో దూకుపోతూ వైరల్ అవుతోంది. ఇక ఈ పాటకు పూజా స్టెప్పులేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఫ్లైట్ డిలే కావడంతో ఎయిర్ పోర్ట్ టనెల్ మార్గంలో వెళుతూ సమంత స్టెప్పులేశారు. ‘జస్ట్ ఎనదర్ లేట్ నైట్ ఫ్లైట్.. నాట్!’ అంటూ ఈమోజీల్ని కూడా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ, తెగ వైరల్ అవుతోంది.